నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియామకం.... ప్రహ్లాద్ జోషి ముందు కఠిన సవాళ్లు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నీట్ వంటి పోటీ పరీక్షలపై విశ్వాసం సన్నగిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటకలోని ధార్వాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ప్రహ్లాద్ జోషి, ప్రభుత్వంలో నమ్మకమైన పరిపాలనాదక్షుడిగా గుర్తింపు పొందారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, పునరుత్పాదక ఇంధనం, వినియోగదారుల వ్యవహారాలు వంటి సంక్లిష్టమైన శాఖలను ఆయన సమర్థంగా నిర్వహించారు. అయితే, విద్యాశాఖ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఇటీవలి కాలంలో విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన చాలామంది ఇంజినీరింగ్, న్యాయశాస్త్రం వంటి వృత్తిపరమైన డిగ్రీలు కలిగినవారే. దీనికి భిన్నంగా జోషి...