నూతన ఒరవడికి తెర తీసిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు నూతన ఒరవడికి కేంద్రబిందువు అవుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెట్టుబడిదారులు క్రమంగా పసిడి వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో దీనికి డిమాండ్ పెరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల బంగారం ధరలు స్థిరత్వాన్ని కోల్పోయినప్పటికీ.. వీటిలో పెట్టుబడి పెట్టే విషయం మదుపర్లు వెనుకాడట్లేదు. అదే సమయంలో పెళ్లిళ్లు, పండగల సీజన్ సమీపిస్తోండటం వల్ల రేట్లల్లో కదలికలు నెలకొన్నాయి. ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో స్థిరమైన, అత్యంత నమ్మకమైన పెట్టుబడి మార్గంగా బంగారం ఎప్పుడూ అగ్రస్థానంలో నిలుస్తుంటుంది. భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇస్తుందనే నమ్మకంతో మధ్యతరగతి ప్రజల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అంతా పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు....