🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 20 Nov, 2026 | Page: 1

షుగర్ వ్యాధితో కిడ్నీ దెబ్బతినడాన్ని ముందే కనిపెట్టే కొత్త పరిశోధన అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురితమైన డా. ధైనిక తూతిక వ్యాసం

షుగర్ వ్యాధితో కిడ్నీ దెబ్బతినడాన్ని ముందే కనిపెట్టే కొత్త పరిశోధన
అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురితమైన డా. ధైనిక తూతిక వ్యాసం
కాకినాడ, పిఠాపురానికి చెందిన యువ వైద్యురాలు *డా. ధైనిక తూతిక* చేసిన పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆమె రాసిన వ్యాసం ప్రపంచ ప్రసిద్ధ వైద్య పత్రిక *Eastern Journal of Medicine* లో ప్రచురితమైంది.
డా. ధైనిక ప్రస్తుతం పుదుచ్చేరిలో జనరల్ మెడిసిన్ విభాగంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కుమార్తె.
ఏం పరిశోధన చేశారు?
షుగర్ వ్యాధి ఉన్న చాలా మందికి కాలం గడిచే కొద్దీ కిడ్నీలు దెబ్బతింటాయి. దీన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. మొదట్లో ఎటువంటి లక్షణాలు కనిపించవు. తెలిసే సరికి వ్యాధి ముదిరిపోతుంది.
ఈ సమస్యను ముందే కనిపెట్టవచ్చా? అనే ప్రశ్నతో డా. ధైనిక బృందం పరిశోధన చేసింది.
షుగర్ ఉన్న 50 మందిని పరిశీలించారు. వీరిలో 25 మందికి కిడ్నీ సమస్య ఉంది, 25 మందికి లేదు. వారి రక్తాన్ని పరీక్షించగా ఒక ముఖ్యమైన విషయం బయటపడింది.
కిడ్నీ దెబ్బతిన్న వారిలో -
- శరీరాన్ని కాపాడే ఒక మంచి పదార్థం *తగ్గిపోయింది*
- కిడ్నీని దెబ్బతీసే వాపు కారకాలు *పెరిగిపోయాయి*
మూత్రంలో ప్రోటీన్ పోతున్న కొద్దీ ఈ మార్పులు ఎక్కువగా కనిపించాయి.
దీని వల్ల ఉపయోగం ఏంటి?
ఇప్పటి వరకు కిడ్నీ దెబ్బతిన్నది తెలియాలంటే చాలా ఆలస్యం అయ్యేది. ఈ పరిశోధన ద్వారా కేవలం రక్త పరీక్షతోనే, ముందుగానే కిడ్నీ దెబ్బతినడాన్ని గుర్తించే అవకాశం ఉందని తేలింది. దీని వల్ల సకాలంలో మందులు వాడి కిడ్నీని కాపాడుకోవచ్చు.
ఈ పరిశోధన వైద్య రంగానికి ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు ప్రశంసించారు.
పరిశోధన వివరాలు:
*అంశం:* Dysregulated PBMC miR-124-3p, TNF-α, and Resistin in Diabetic Nephropathy
*జర్నల్:* Eastern Journal of Medicine, 31(4): 826-833, 2026
*DOI:* 10.5505/ejm.2026.09734 See less
🏠 Home