*శిరిడీ సాయిబాబా ఆలయంలో అన్నదానం, వైద్య సేవలకు రూ.2 లక్షల విరాళం*

శిరిడీ సాయిబాబా ఆశీస్సులతో నేడు పవిత్రమైన శిరిడీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో అన్నదానం మరియు వైద్య సేవల కోసం TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరెషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు తన కుటుంబ సభ్యులతో కలిసి రూ.2,00,000 విరాళంగా అందజేశారు.
అనంతరం శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, శిరిడీ CEO శ్రీ గోరక్ష్ గాడిల్కర్ (IAS) గారు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం, సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్నదానం, వైద్య సేవలకు తమ వంతు సహకారం అందించడం ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మికంగా సంతృప్తినిచ్చిన సందర్భమని పేర్కొన్నారు.
సాయిబాబా కృప, ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని, సేవా భావం, మానవత్వం, కరుణతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం ప్లాస్టిక్ వాడొద్దు అని జూట్ బ్యాగులను వాడాలి అనే ఉద్దేశంతో జూడ్ బ్యాగులను ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది
అనంతరం మీడియా తో ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ
“సేవే సాయిసేవ.. మానవ సేవే మాధవ సేవ” అనే స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఉప్పల స్వప్న, కుమారుడు సాయి కిరణ్, కోడలు శార్వరి, చిన్న కుమారుడు సాయి తేజ, చిన్న కోడలు వైష్ణవి పాల్గొన్నారు.