ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరమని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టులు వృత్తి గౌరవాన్ని నిలబెట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్యమాలపై నిర్వహించిన ఒకరోజు వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని మెరుగైన జర్నలిజాన్ని ప్రజలకు అందించేందుకు, అలాగే వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా జర్నలిస్టులకు ఉపయోగపడుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే నల్గొండ డివిజన్ పరిధిలోని జర్నలిస్టులకు ఉద్దేశించి ఒక రోజు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అక్టోబర్ 12న నాగార్జునసాగర్ లో కూడా నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల జర్నలిస్టులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్యమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని, దీన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ పత్రిక స్వేచ్ఛ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, విస్తృతార్థాలు, వర్కింగ్ జర్నలిస్ట్, వృత్తి పరమైన జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన ప్రధాన చట్టాలు ,తదిత అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిజిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు జర్నలిస్టులా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులలో వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో ప్రజలకు తెలిసేలా వార్తలందించాలని, ఏ ఐ,సోషల్ మీడియా వాడకాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా ఇది జర్నలిస్టులకు ఎంతో అవసరమని అన్నారు.
స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో మంచి తోపాటు, చెడు కూడా సంభవించే అవకాశం ఉందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సద్వినియోగం అయ్యేలా జర్నలిస్టులు కృషి చేయాలని, రిపోర్టర్లు నిరాధార వార్తలు రాయవద్దని కోరారు.
ఈ సందర్భంగా ఆర్టిఫిజిల్ ఇంటెలిజెన్స్ పై టైమ్స్ అఫ్ ఇండియా ఎడిటర్ ఇన్వెస్టిగేషన్ ఉడుముల సుధాకర్ రెడ్డి, సోషల్ మీడియా పై నరసింహస్వామి లు జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు.
నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, నల్గొండ జిల్లా సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు ,జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ ఓ ఎస్ డి రహమాన్,పి ఆర్ ఓ శైలేశ్వర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.