🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 02 Oct, 2026 | Page: 1

జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత గాంధీజీని ఆదర్శంగా తీసుకొని జీవించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఖైదీలకు పిలుపునిచ్చారు.

జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత గాంధీజీని ఆదర్శంగా తీసుకొని జీవించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఖైదీలకు పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి అయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఖైదీలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నవ సమాజ నిర్మాణం లో భాగస్వాములు కావాలని, ఇందుకు ఖైదీలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ముందుగా అ మార్పు తనలోనే రావాలని, గతంతో పోలిస్తే సమాజంలో ప్రస్తుతం అనేక మార్పులు వచ్చాయని, ఒకప్పుడు చదువు అంతగా ఉండేది కాదని, ప్రస్తుతం అందరూ చదువుకోవాలని కోరుకుంటున్నారని, జైలులో చదువు రాని ఖైదీలు తప్పనిసరిగా చదువు నేర్చుకోవాలని, జిల్లా యంత్రాంగం తరఫున బోధకులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమాజానికి తగ్గట్టుగా అందరూ నడవడికను మార్చుకోవాలని, చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండాలని చెప్పారు. “పాఠశాలలో ఎక్కువ మంది ఉండాలి, జైల్లో తక్కువ మంది ఉన్నప్పుడే” ఆ సమాజం బాగుపడుతుందని అన్నారు. ప్రభుత్వం ఖైదీలకు జైలులో అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నదని, వాటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని, శిక్ష అనుభవించి బయటికి వచ్చిన ఖైదీలు ఒక లక్ష్యంతో జీవించాలని, స్వయం ఉపాధి చూసుకోవాలని ,ప్రభుత్వం కూడా స్వయం ఉపాధి కల్పించేందుకు సహకరిస్తుందని తెలిపారు. జైల్లో మంచి అలవాట్లను నేర్చుకుని మంచి మనిషిగా బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు .
జిల్లా మొదటి అడిషనల్ సెషన్స్ జడ్జి కె. కవిత మాట్లాడుతూ జైల్లో ఖైదీలకు అనేక సౌకర్యాలు ఉన్నాయని, ఖైదీలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఓపికగా ఉండి సంస్కారవంతులై జైలు నుండి బయటకు రావాలని పిలుపునిచ్చారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ ,సీనియర్ సివిల్ జడ్జి హిమబిందు మాట్లాడుతూ ఖైదీలు మానవతా విలువలు నేర్చుకోవాలని, వారిని వారే మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, చదువురాని వారు చదువుకోవాలని, జైల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
అదనపు ఎస్ పి రమేష్ మాట్లాడుతూ చిన్న చిన్న తప్పిదాల వల్ల జైలు పాలైన వారు తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో చట్టాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అలాగే సమాజాన్ని గురించి కూడా తెలుసుకోవాలని, జైలు జీవితం తర్వాత మంచి పౌరులుగా మెలగాలని చెప్పారు.
జైలు సూపరింటెండెంట్ కే. ఆనందరావు, జిల్లా జైలు డాక్టర్ కిరణ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ,ఎడిజేలు వివిధ పోటీలలో గెలుపొందిన ఖైదీలకు బహుమతులను పంపిణీ చేశారు.

జైలర్ అచ్చయ్య,బాలకృష్ణ తదితరులు ఉన్నారు.
🏠 Home