ఏసీబీకి చిక్కిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు! రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన రూ.27.54 లక్షల బకాయిల కోసం రూ.2.5 లక్షల లంచం డిమాండ్.. 🚨
రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన రూ.27.54 లక్షల బకాయిల కోసం రూ.2.5 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు! 🚨
చేవెళ్ల అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (ఏటీవో) కావలి అనూరాధ, సబ్ ట్రెజరీ అధికారి (ఎస్టీవో) మాడిగ లక్ష్మయ్యలను ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి జంగయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ అంగిళ్ల ఆనందకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లలో గ్రామ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. గతంలో ఆయన సస్పెన్షన్‌కు గురికాగా, కోర్టులో ఊరట లభించింది.
దీంతో సస్పెన్షన్ కాలానికి సంబంధించిన వేతనం, పెన్షన్ సర్దుబాటు బకాయిలుగా రూ.27.54 లక్షలు రావాల్సి ఉంది. ఆ మొత్తానికి సంబంధించిన బిల్లు మంజూరు కోసం బాధితుడు కొంతకాలంగా చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
బిల్లు మంజూరు చేసేందుకు ఏటీవో, ఎస్టీవోలు రూ.2.5 లక్షల లంచం డిమాండ్ చేసి, ముందుగా రూ.లక్ష చెల్లించాలని కోరినట్లు ఆరోపణ. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఏసీబీ సూచనల మేరకు గురువారం కార్యాలయంలో లక్ష్మయ్య తన వాటాగా రూ.50 వేలు నేరుగా బాధితుడి నుంచి తీసుకున్నట్లు, అనంతరం ఏటీవో అనూరాధ సూచనల మేరకు జంగయ్య మిగిలిన రూ.50 వేలు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
నగదు స్వీకరించిన వెంటనే ఏసీబీ బృందం వారిని పట్టుకుని పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది. సంబంధిత అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.