🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 18 Sep, 2026 | Page: 1

అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలు ఉండేలా నల్లగొండ జిల్లా మోడరన్ ఆర్టీసీ బస్ స్టాప్ ఉండాలి

రానున్న కొద్ది రోజుల్లోనే నల్లగొండ అన్ని రంగాలకు ప్రత్యేక హబ్ గా మారనుంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం

హైదరాబాద్ తర్వాత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నల్లగొండ అభివృద్ధికి కృత నిశ్చయంతో ఉన్నాం

అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలు ఉండేలా నల్లగొండ జిల్లా మోడరన్ ఆర్టీసీ బస్ స్టాప్ ఉండాలి

రద్దీకి అనుగుణంగా బస్సుల రాకపోకలు సులభతరం అయ్యేలా ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్స్,ప్లాట్ఫారాలు,వెయిటింగ్ హాల్స్, సరిపడా పార్కింగ్,మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి

బస్ స్టాప్ పైన మల్టీఫ్లెక్స్,అత్యాధునిక ఏర్పాట్లు చేయాలి

విద్యుత్ ఆదా అయ్యేలా సోలార్ ఏర్పాటు చేయాలి

దసరా ముందు మోడరన్ బస్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసేలా ఆర్టీసీ ఎండీ చర్యలు చేపట్టాలి

ఈ బస్ స్టాప్ ఆధునీకరణ వల్ల ఆర్టీసీకి దాదాపుగా 85లక్షల ఆదాయం

- నల్లగొండ జిల్లా ఆర్టీసీ బస్ స్టాప్ ఆధునీకరణ సమీక్షా సమావేశంలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి☝🏼


హైదరాబాద్:

రానున్న కొద్ది రోజుల్లోనే నల్లగొండ ప్రత్యేక హబ్ గా మారనుందనీ,అందుకు అనుగుణంగా హైదరాబాద్ తర్వాత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నల్లగొండ అభివృద్ధికి కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇప్పటికే నల్లగొండను మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, మౌళిక సదుపాయాల కల్పన చేస్తున్నామని స్పష్టం చేశారు.

అందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలు
ఉండేలా నల్లగొండ జిల్లా ఆర్టీసీ బస్ స్టాప్ ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
బస్ స్టాప్ ఆధునీకరణపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో శుక్రవారం ఆర్టీసీ అధికారులు,కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బస్ స్టాప్ ఆధునీకరణకు సంబంధించిన నమూనాను కన్సల్టెన్సీ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా నమూనాలో పలు మార్పులు చేయాలని కన్సల్టెన్సీ ప్రతినిధులకు మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నల్లగొండ బస్ స్టాప్ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది.అందుకు అనుగుణంగా బస్సుల రాకపోకలు సులభతరం అయ్యేలా ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్స్,ప్లాట్ఫారాలు,వెయిటింగ్ హాల్స్,సరిపడా పార్కింగ్,మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టీసీకి లాభం కలిగించేలా గ్రౌండ్,మొదటి అంతస్తులో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని,ప్రజలకు వినోదాన్ని అందించేందుకు రెండవ అంతస్తులో మల్టీఫ్లెక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ పై విద్యుత్ భారం పడకుండ బస్ స్టాప్ పై భాగంలో సోలార్ ఏర్పాటు చేయాలన్నారు. దసరాకు 2రోజుల ముందు శంకుస్థాపన చేసుకునేలా అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆర్టీసీ ఎండీ, అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
నిర్మాణ సమయంలో ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బస్ స్టాప్ ఆధునీకరణ తరువాత షాపుల రెంట్ల ద్వారా ఆర్టీసీకి 85 లక్షల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉందని కన్సల్టెన్సీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి,ఆర్టీసీ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
🏠 Home