6 గ్యారెంటీలు, ప్రజా సమస్యలు, 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అసెంబ్లీ ముట్టడి

హైదరాబాద్: 6 గ్యారెంటీల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన జనసేన నాయకులు, వీరమహిళలను పోలీసులు అరెస్టు చేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రేమ్ గాంధీ గారు, మీసాల శ్రీనివాస్ గారు, శ్రీధర్ శర్మ గారు, హైందవి రెడ్డి గారు, రాంబాబు పైడిపల్లి గారు, శోభనబాబు గారు, అజయ్ కుమార్ గారు, ముజఫర్ అలీ గారు, పద్మజ గారు, వెంకటలక్ష్మి గారు, భవ్య గారు, రేఖ గారు, సందీప్ గారు, వెంకటేష్ గారు, విజయ్ కుమార్ గారు తదితర జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.
22-A భూముల సమస్యతో వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయడం సరికాదని జనసేన నాయకులు అన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాటం — అరెస్టులతో ఆగదు.