🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 01 Aug, 2026 | Page: 1

ఆపరేషన్ ముస్కాన్–XII ద్వారా నల్లగొండ జిల్లా పోలీసుల విశేష విజయాలు ..

ఆపరేషన్ ముస్కాన్–XII ద్వారా నల్లగొండ జిల్లా పోలీసుల విశేష విజయాలు ..

124 మంది చిన్నారులకు రక్షణ – 108 కేసుల నమోదు – బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు
-జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ .

పిల్లల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన, నిరాశ్రయులైన మరియు ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన "ఆపరేషన్ ముస్కాన్–XII" కార్యక్రమంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ విశేష ఫలితాలు సాధించిందని జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPS తెలిపారు.

జూలై నెల మొత్తం ప్రత్యేక కార్యాచరణగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో జిల్లా పోలీస్ శాఖలోని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో మహిళా & శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం (DCPU), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) తదితర శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు, వర్క్‌షాపులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, నిర్మాణ ప్రదేశాలు మరియు ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా మొత్తం 124 మంది చిన్నారులను సంరక్షించినట్లు ఎస్పీ వెల్లడించారు. వీరిలో 122 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని తెలిపారు.

చిన్నారులను అక్రమంగా పనుల్లో నియమించుకున్న 108 మంది యజమానులపై కేసులు నమోదు చేసి, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

సంరక్షించిన చిన్నారుల్లో అధిక సంఖ్యలో బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని, వీరిలో చాలామంది రైస్ మిల్లులు, బేకరీలు, హోటళ్లు మరియు ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

రక్షించిన చిన్నారులందరినీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఎదుట హాజరుపరిచి, వారి కుటుంబ వివరాలను సేకరించి, చట్టపరమైన నిబంధనల మేరకు తల్లిదండ్రులకు అప్పగించడం లేదా అవసరమైన సంరక్షణ గృహాలకు తరలించడం జరిగిందని తెలిపారు. అలాగే వారి విద్య, పునరావాసం, సంక్షేమం కోసం సంబంధిత శాఖల ద్వారా అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, IPS మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపమని, ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, ఆరోగ్యం, సురక్షితమైన బాల్యం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

14 సంవత్సరాల లోపు పిల్లలను ఎలాంటి పనుల్లోనూ నియమించడం చట్టవిరుద్ధమని, అలాగే 14 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలలను ప్రమాదకర పరిశ్రమల్లో పనిలో పెట్టడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసరాల్లో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గమనించినా, ఏ చిన్నారి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100/112, చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించి చిన్నారుల రక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు నెల రోజుల పాటు అదనపు ఎస్పీ రమేష్ గారి పర్యవేక్షణలో డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో మూడు సబ్ డివిజనల్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పనిచేసి బాలలను రక్షించిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఎస్ఐ అంజలి మరియు సిబ్బంది, కార్మిక శాఖ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) గణేష్, ఎన్‌జీఓ శోభారాణి మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
🏠 Home