డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆఫీసర్స్ ఆడిట్ కమిటీ సభ్యుల కలిసినతెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ మరియు అధ్యక్షులు పులి లక్ష్మయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి, పద్మ, రాజ్ మమ్మద్ మరియు జేఏసీ నాయకులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆఫీసర్స్ ఆడిట్ కమిటీ సభ్యులు అయిన గౌరవనీయులు మహ్మద్ నదీమ్ IAS, సిక్తా పట్నాయక్ IAS డాక్టర్ గౌరవ్ ఉప్పల్, IAS, మరియు EVV నాగేశ్వరరావు సార్ ని తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ మరియు అధ్యక్షులు పులి లక్ష్మయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి, పద్మ, రాజ్ మమ్మద్ మరియు జేఏసీ నాయకులు కమిటీని కలిసి ముఖ్యంగా ఏజెన్సీల వల్ల జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అధికారుల వేధింపులను, నిరుద్యోగుల నుండి బలవంతపు వసూళ్లని, సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం గురించి, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఆత్మగౌరవం ఇవ్వాలని, అలాగే ఇంకా పెండింగ్లో ఉన్న జీతాలను రిలీజ్ చేయాలని అందర్నీ IFMIS పోర్టల్ లో ఆడ్ చేయాలని రిప్రెజెంటేషన్ జరిగింది. కమిటీ వారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది.